టేకులపల్లి, అక్టోబర్ 18 : 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం తలపెట్టిన బీసీల రాష్ట్ర బంద్ టేకులపల్లి మండలంలో శనివారం విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9ని సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేయడం ప్రజా వ్యతిరేకమని, అభివృద్ధి నిరోధకమని, వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కి నెట్టేసేదిగా ఉన్న ఈ తీర్పులను తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ర్యాలీలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కోరం సురేందర్, బేతంపూడి సోసైటి చైర్మన్ లక్కినేని సురేందర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బానోత్ ఊక్లా, కల్తి వెంకటేశ్వర్లు, జరుపుల సుందర్, హార్జ్య బీఆర్ఎస్ నాయకులు బొమ్మర వరప్రసాద్. బోడ బాలు, కాంగ్రెస్ నాయకుడు రెడ్యానాయక్, బీజేపీ నాయకుడు తేజావత్ శంభు, సీపీఐ మండల కార్యదర్శి రాంచందర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గుడిపూడి మోహన్ రావు, ఎల్హెచ్పీహెచ్ నాయకుడు భూక్య లాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు నల్లగట్ల వెంకన్న, మెంతన ప్రభాకర్, బీసీ సంఘాల నాయకులు ధర్మపురి వీరబ్రహ్మచారి, తౌడోజు భిక్షమయ్య, నర్సింగ్ లక్ష్మయ్య, మావునూరి రమేశ్, చిర్రా వెంకటయ్య, గాడెపల్లి రాములు, కటుకోజ్వల సురేశ్, వాసల తిరుపతి, దామోదర్, గుండా నర్సింహరావు, అంబాల బాబు, ఆరేళ్ల కుమార్, గాడేపల్లి వెంకన్న పాల్గొన్నారు.
Tekulapally : టేకులపల్లిలో బీసీ బంద్ సంపూర్ణం