బూర్గంపహాడ్ :వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడోరోజు మండల పరిధిలోని మోరంపల్లిబంజరతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా, జరుపుకుంటున్నారు. మూడవరోజు నానబియ్యం బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌరమ్మకు నైవైద్యం సమర్పించి పేర్చిన బతుకమ్మ ఆటపాటలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు