రామవరం ఏప్రిల్ 18 : వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని రుద్రంపూర్ ముస్లిం మత పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మజీద్-ఏ – క్యూబా లో చేతులకు నల్ల రిబ్బన్ పట్టీలు ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుండి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మసీద్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలాంటి మతోన్మాద చర్యలు చేపడుతుందని విమర్శించారు. కేంద్రం చర్యలను లౌకికవాదులు ఖండించాలని కోరారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు అబ్దుల్ భాషిద్, ఐఎన్టియుసి కొత్తగూడం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, సోను భాయ్, మహ్మద్ రఫీ, ఆలం, షమీమ్, మునవర్, అజార్, రహిమత్, ఖాసీం బాబా, ఫహీం, రహీం, అరీఫ్, ఖాసీం, శుక్రు, సోహెల్, అక్రమ్, మదర్ సాబ్, తదితరులు ఉన్నారు.