బూర్గంపహాడ్, మే 16 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ(ఇంట్రా) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరబ్రహ్మదేవ్, మండల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిశోర్ ఆదేశాల మేరకు సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన శనివారం నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాల సిబ్బంది అహ్మద్పాషా, వెంకట్ మహరాజు మిషన్ భగీరథ నీటి నాణ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు భూగర్భ జలాలు, మినరల్ వాటర్, మిషన్ భగీరథ నీటికి సంబంధించి వ్యత్యాసాలు, తేడాలు వివరించి వారిలో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బర్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.