బూర్గంపహాడ్, మే 13 : బూర్గంపహాడ్ మండలంలో ఉపాధి హామీ కూలీలకు ఎంపీడీఓ జమలారెడ్డి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. బుధవారం బూర్గంపహాడ్‌లో ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మితో కలిసి ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో జాబ్‌కార్డులో పేర్లు తొలిగిపోతాయని కూలీలకు వివరించారు. జాబ్‌కార్డు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే పనులకు వచ్చేలా చూడడానికి, ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఈ-కేవైసీ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు తమ సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఈ- కేవైసీ లేని కూలీలకు పనులు చేసినా వేతనాలు రావని, ఇందుకోసం ఉపాధి కూలీలు తప్పకుండా ఈ-కేవైసీ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.