– ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలి
– డీఎస్పీ ఆదినారాయణ
చుంచుపల్లి, మార్చి 31 : ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని డీఎస్పీ ఆదినారాయణ అన్నారు. డ్రగ్స్, అవినీతి నిరోధంపై చుంచుపల్లి మండలం రామ్ నగర్లోని ఎస్ ఆర్ డీ జీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. మన చుట్టుపక్కల జరుగుతున్న అవినీతిపై జాగరుకులై ఉండి ఎంతోమందికి మార్గదర్శకులుగా ఎదగాలని కోరారు. సీఐ వెంకటేశ్వర్లు రోడ్డు వారోత్సవాలలో భాగంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కొత్తగూడెం జోనల్ ఇన్చార్జి సతీశ్, ఎస్ఐ రవికుమార్, ఎస్ ఆర్ డిజి ప్రిన్సిపాల్ తిరుమల్ రెడ్డి, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.