రుద్రంపూర్, ఏప్రిల్ 15 : చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందితే భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. బుధవారం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో “అరైవ్ – అలైవ్” కార్యక్రమంను బుధవారం టూ టౌన్ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు. “రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలనే విషయాన్ని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు గుర్తు చేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రహదారి నియమాలను గౌరవించడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు నష్ట పోతున్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్లో మోడ్రన్ క్రా, స్వర్ణ భారతి పాఠశాల విద్యార్థుల చేత మానవహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మనీషా, అబ్దుల్ బషీద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన