రామవరం, నవంబర్ 07 : కొత్తగూడెం ఏరియాలో పనిచేసే జనరల్ అసిస్టెంట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ కౌన్సిలింగ్‌ను వెంటనే ఏర్పాటు చేసి ఏరియాలో గల సర్ఫేస్ ఖాళీలను సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఏరియా కార్మికులతో మాత్రమే నింపాలని హెచ్ఎంఎస్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ అన్నారు. శుక్రవారం ప్రధానమైన డిమాండ్‌తో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజుకు మెమోరాండం అందజేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ అన్‌ఫిట్ వారసులకు పోస్టింగ్‌ల విషయంలో జాప్యాన్ని విడనాడి వెంటనే పోస్టింగ్‌లు కల్పించాలన్నారు. సత్తుపల్లి సమంత ఓ అండ్ ఎం లో ప్రైవేట్ వారితో నడుపుతారు అని వస్తున్న వార్తలను ఖండిస్తూ ప్రైవేట్ వారితో కాకుండా పర్మినెంట్ కార్మికులతో మాత్రమే సిఎస్పి నడపాలన్నారు. రుద్రంపూర్ ఆర్ సి హెచ్ పి నందు ఖాళీలను ఆర్ సి హెచ్ పి నందు విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జీఎంకు మెమోరండం అందజేయడం జరిగిందన్నారు.
దీనికి జీఎం సానుకూలంగా స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను జిఎంకు హెచ్ఎంఎస్ యూనియన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్, సత్తుపల్లి సమంత, పిట్ సెక్రెటరీ కాకా నరసింహారావు, కిష్టారం ఫిట్ సెక్రెటరీ మొగిని, ఏరియా వర్క్ షాప్ పిట్ సెక్రటరీ కరీం, రుద్రంపూర్ ఆర్ సి హెచ్ పి ఫిట్ సెక్రటరీ పూర్ణచంద్రరావు, (సొసైటీ డైరెక్టర్) పి వి కే ఫై అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నవీన్, హెచ్ఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ, కన్వీనర్ శ్రీనివాస్, బ్రాంచ్ కో ఆర్డినేటర్ అజీమ్, వికే ఓ సి నాయకుడు ఫాహీమ్, కన్వీనర్ సాయి సందీప్, ఆర్గనైజర్ మోహన్ రావు, వర్క్ షాప్ నాయకుడు ప్రకాష్ పాల్గొన్నారు.