రామవరం, జులై 09 : అర్హులైన ముస్లింలు 2026లో చేపట్టే హజ్ యాత్రకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్ట్ ఫొటో, పాన్ కార్డు, పాస్‌పోస్ట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్‌తో https://hajcommittee.gov.in వెబ్ సైట్ నందు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం 85208 60785 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.