రామవరం, నవంబర్ 18 : ఎం.ఎస్.ఎం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి ద్వారా జ్యూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక నిరుద్యోగ మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ 45 రోజుల పాటు కొనసాగనున్నట్లు వెల్లడించారు. అర్హత, ఆసక్తి కలిగిన జికేఓసీ/ వికే కోల్ మైన్స్ పరిసర ప్రభావిత గ్రామాల నిరుద్యోగ మహిళలు ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తులను కొత్తగూడెం ఏరియాలోని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాలని పేర్కొన్నారు.