ఇల్లెందు, జనవరి 23 : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనారిటీ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను పొందాలని ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు 24 ఏరియా మైనారిటీ గురుకుల పాఠశాలలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, మైనారిటీ పెద్దలు, ఉపాధ్యాయులతో కలిసి ఏర్పాటు సమావేశంలో 2026- 27 విద్యా సంవత్సరంగాను అడ్మిషన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. 2026- 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ముస్లిం మైనారిటీలకు 51, క్రిస్టియన్ మైనార్టీలకు 5, ఇతర మైనారిటీలకు 5, బీసీ-10, ఎస్సీ-5, ఎస్టీ-3, ఎస్సీలకు 2 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అలాగే మైనారిటీ గురుకులాల్లో వివిధ క్లాసుల వారీగా ఖాళీగా ఉన్న సీట్లు 6వ తరగతి- 44, 7వ తరగతి- 25, 8వ తరగతి- 40 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పిల్లలకి మంచి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కాజీ ఇబ్రహీం, ఇల్లెందు మైనారిటీ ప్రెసిడెంట్ ఎస్కే గౌస్, సెక్రటరీ గౌస్, అక్రమ్, అఖిల్, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Yellandu : మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు