రుద్రంపూర్, మే 14 : ఎండలు మండిపోతున్న వేళ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్తగూడెం పట్టణంలోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో మరో నూతన బోర్ ఏర్పాటు చేశారు. డా.అలీ బాబా ఇంటి ముందు డివిజన్ కార్పొరేటర్ మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో ఈ బోర్ పనులు ప్రారంభమయ్యాయి. వేసవి కాలంలో నీటి కొరతతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల అవసరాన్ని గుర్తించి వెంటనే స్పందించి బోర్ వేయించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బోర్‌తో కలిపి డివిజన్లో ఇప్పటివరకు మూడు బోర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “ప్రజలకు తాగునీరు అందించడం మా బాధ్యత” అని పేర్కొన్న కార్పొరేటర్ మల్హోత్రా సాగర్, డివిజన్లో ఎక్కడ నీటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎండాకాలంలో తాగునీటి సమస్య తీరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, షేక్ జానీ, ఎత్తు సమ్మయ్య, పాసికంటి రమేష్, బొమ్మిసెట్టి కిరణ్, రామాచారి, టెంట్ హౌస్ ప్రకాష్, మారపల్లి రవి, నీలం పుల్లయ్య, బుధారపు శ్రీను, బుధారపు వెంకన్న కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మల్హోత్రా కుమార్, వేముల పవన్, లేతాకుల నాగరాజు, సాగంటి రవి, చింతల రాము, రేగుల రాజేష్, లగిశెట్టి ప్రసాద్, గుడిసె శ్రావణ్, బుధారపు చరణ్, మహమ్మద్ జఫ్ఫు, గుర్రాల సాయి, వెలిశాల పవన్‌తో పాటు డివిజన్ మహిళలు పాల్గొన్నారు.