రామవరం ఏప్రిల్ 14 : అంబేద్కర్ అందరివాడు అని కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో గల పదో వార్డులో అంబేద్కర్ చమన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ద్వారా కుల, మత, వర్గ, వైశాల్యాలు లేని సమాజం కోసం, మానవులందరికీ సమాన హక్కులు కల్పించి, అందరికీ విద్యను అందించడం ద్వారానే అంటరానితనం నిర్మూలన జరుగుతుందని భావించిన గొప్ప దార్శనికుడని బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఆయన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక సౌకర్యాలను కులం, మతం, వర్గ బేధం లేకుండా అందరూ సమానంగా అనుభవిస్తున్నట్లు తెలిపారు. అందుకే అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో చెందిన వాడు కాదని, అంబేద్కర్ అందరివాడు అని అన్నారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం ఔనత్యాన్ని కాపాడుతామని, భారత రాజ్యాంగ మూలాలను దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఐక్యమత్యంతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ పూనారు.
మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సావటి స్వామి, గంటాడి కోటేశ్వరరావు, బయన ఈశ్వరయ్య, శాఖ కార్యదర్శులు సూరిమేని జనార్ధన్, రావుల దాసు, ఎస్కే జలీల్, సత్యనారాయణ (కొండ), ఆర్ఎంపీ డాక్టర్ సబ్బాని సతీశ్, మార్తమ్మ, టీచర్ ఎన్.సరోజ, నాయకులు అజరయ్య, కాంపల్లి దుర్గయ్య, బానోతు చందర్, సూరిమేని రామారావు, తోగరు నరేందర్, సబ్బని పాపారావు, బానోత్ శ్రీను, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న, గోపి, సలీం, సత్తార్ పాల్గొన్నారు.