ఇల్లెందు, సెప్టెంబర్ 04 : గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వినతి పత్రాన్ని కార్యాలయ తలుపునకు అంటించారు. ధర్నాకు సారంగపాణి అధ్యక్షత వహించగా సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చండ్ర అరుణ, ఎన్డీ పార్టీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బ్రహ్మచారి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి నాయిని రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర వెంకన్న, న్యూ డెమోక్రసీ ఇల్లెందు పట్టణ కార్యదర్శి ఎండీ రాసుద్దీన్, సిపిఎం జిల్లా నాయకులు ఎస్సీ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ పాల్గొన్నారు.
Yellandu : ఇల్లెందులో యూరియా కోసం అఖిలపక్ష నాయకుల ధర్నా