ఇల్లందు ,జూన్ 15 : కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జూన్ 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో వాలస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అడవుల్లోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆపరేషన్‌ను చేపట్టారని ఆరోపించారు. మహాధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎం డి.రాసుద్దిన్, కొక్కు సారంగపాణి, కొప్పుల శ్రీనివాస్, బొగ్గరపు రాజు, సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, సిపిఎం నాయకులు ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, టిడిపి నాయకులు చందావత్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.