టేకులపల్లి అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మెల్లమడుగు గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోని గృహప్రకారణాలు, దుస్తులతో సహా ఫర్నిచర్ కాలి బూడిదయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలంలోని మేళ్ల మడుగు గ్రామానికి చెందిన వట్టం నాగేశ్వరరావు ఇల్లు కాలి బూడిదైంది.
వట్టం నాగేశ్వరరావు కుటుంబంతో సహా తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి, ఫైర్ స్టేషన్ కి సమాచారం అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.