– వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరిన 55 కుటుంబాలు
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, ఆగస్టు 14 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా ఇల్లెందు నియోజకవర్గం బయ్యారం మండలం జగ్గుతండాలో వివిధ పార్టీలకు చెందిన 55 కుటుంబాలు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాతా గణేశ్, జగ్గుతండా కొమ్మరాజు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. వారందరికీ హరిప్రియ నాయక్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు ఏనుగులు ఐలయ్య, బానోత్ శ్రీను, మండల యూత్ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్, యూత్ ఉపాధ్యక్షుడు, ప్రచార కార్యదర్శి రేపాకుల వెంకన్న, మండల నాయకులు జరుపల శ్రీను, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ఇస్లావత్ వీరన్న, సునీల్, కొండల్ నాయక్, జగ్గు తండా సోషల్ మీడియా ఇన్చార్జి శోభనాయక్, బండమీది సంపత్, రేఖ యాకన్న, నీలారకు సంపత్, ఉదయ్, సందీప్, వీరబాబు, ఎల్లయ్య, అర్జున్, మహేశ్, అనిల్, రాజేశ్ పాల్గొన్నారు.
Yellandu : కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్లోకి