టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం
టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
– సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్
రామవరం, డిసెంబర్ 11: టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. జాతీయ సంఘాల అలసత్వంతోనే నాడు కారుణ్య నియామకాలు దూరమయ్యాయని, టీబీజీకేఎస్ గెలిచిన తర్వాతే గత ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి కారుణ్య నియామకాలు సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులకు వేలానికి పెడితే, అందుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు సమ్మె చేసింది తమ సంఘమేనన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా త్వరలో టీబీజీకేఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో 11 మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, నాయకులు కూసన వీరభద్రం, గుత్తుల సత్యనారాయణ, గడప రాజయ్య, నాగార్జున, కనకారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

