
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా బాల్యవివాహాలు జరగటం దురదుష్టకరమనీ వీటిని నిరోదించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్య వివాహం చట్టవిరుద్దమనీ, వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శిక్ష పడే అవకాశమందని పేర్కొన్నారు.
బాలల భవితకు బాల్యవివాహాలు అడ్డంకిగా మారుతున్నాయనీ, పెళ్లి పేరుతో ఆడపిల్ల ల ఆశలను చిదిమేయొద్దన్నారు.ఈ సందర్భంగా బాల్యవివాహల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ప్రొబెషనరీ ఎస్ఐ సురేష్, సర్పంచ్ అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.