ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 21: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారులతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని విధులు నిర్వర్తించాలని, పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలని అన్నారు.
- సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి
- రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 21: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారులతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని విధులు నిర్వర్తించాలని, పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలని అన్నారు. నిత్యం కొత్త కోణాల్లో జరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు సతీష్‌కుమార్, వెంకన్నబాబు, రవీందర్‌రెడ్డి, మల్లయ్యస్వామి, అశోక్‌కుమార్, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

