Khammam : కారేపల్లి (కామేపల్లి), జులై 22ః ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం (Pandithapuram)లో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు వేర్వేరుగా ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పండితాపురానికి చెందిన గాడిపల్లి శ్రీకాంత్(24) గ్రామ సమీపంలోని పంట చేలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే శ్రీకాంత్ ఇంటి పక్కనే నివసించే బండి హారిక (19) కుటుంబసభ్యులు ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను కామేపల్లి పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. శ్రీకాంత్, హారికల సూసైడ్‌కు దారి తీసిన పరిస్థితుల గురించి దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.