Bonalu at Hamburg : తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బోనాలు (Bonalu). ఈ పండుగను తొలిసారిగా జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ,డప్పు,లాస్య నృత్యాలు లాంటి సంప్రదాయ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. కుటుంబ సమేతంగా వచ్చిన తెలంగాణ సముదాయం, సంఘం సభ్యులు ఈ వేడుకలో పాల్గొని తమ రాష్ట్రమూలాలు, భారతీయత పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు.
“భారతీయతను, తెలంగాణను, భక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుదాం!” అన్న సందేశంతో TANH చేపట్టిన ఈ పండుగ కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా సాగింది. ఈ వేడుకలో టీఏయెన్హెచ్ ప్రతినిధులు రత్నాకర్, విజయ్ సత్య, శ్రీనివాస్, రామ్ అఖిల్, వంశీ, జంపన్న, రాజు, మహేశ్, అనంత్.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బోనాలతో కదిలివచ్చిన మహిళలు