INDW vs ENGW | శతకంతో చెలరేగిన హర్మన్‌ప్రీత్.. మూడొందలు కొట్టేసిన భారత్..!
INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్‌కు ఓపెనర్ స్మృతి మంధాన(45) మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది.
INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్‌కు ఓపెనర్ స్మృతి మంధాన(45) మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు హర్లీన్ డియోల్ (45) జెమీమా రోడ్రిగ్స్(50)లు ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. ఈ ముగ్గురు షాన్‌దార్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 రన్స్ చేసింది.
మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ కొట్టింది. రివర్సైడ్ గ్రౌండ్లో ఓపెనర్ స్మృతి మంధాన(45) తనదైన స్టయిల్లో ఇంగ్లండ్ బౌలర్లకు దడ పుట్టిస్తూ బౌండరీలతో విరుచుకుపడింది. ప్రతీకా రావల్(26)తో కలిసి శుభారంభమిచ్చింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. ఈ జోడీ అర్ధ శతక భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేసింది. తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని చార్లీ డీన్ విడదీసింది. ఆ కాసేపటికే మంధాన అర్ధ శతకానికి ముందు పెద్ద షాట్ ఆడి డంక్లే చేతికి చిక్కింది. దాంతో, 81వద్ద రెండో వికెట్ పడింది.
1⃣0⃣2⃣ runs
8⃣4⃣ deliveries
1⃣4⃣ foursA sensational knock by Captain Harmanpreet Kaur in the series decider 💯👏
Updates ▶️ https://t.co/8sa2H24aBL#TeamIndia | #ENGvIND | @ImHarmanpreet pic.twitter.com/jkv2aRLSLL
— BCCI Women (@BCCIWomen) July 22, 2025
అనంతరం హర్లీన్ డియోల్(45), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(102)లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. డియోల్ ఔటయ్యాక జెమీమా రోడ్రిగ్స్(50) జతగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. ఏడో సెంచరీతో చెలరేగిన కౌర్ వెనుదిరిగాక వికెట్ కీపర్ రీచా ఘోష్(38 నాటౌట్), రాధా యాదవ్(2 నాటౌట్)లు ధనాధన్ ఆడడంతో భారత జట్టు ప్రత్యర్థికి 319 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి
- MLC Deshapati Srinivas | పేద ప్రజల ఆర్తియే దాశరథి కవితకు చమురు : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
- Soaked Peanuts | పల్లీలను ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..?
- CEC | బిహార్‌లో 52 లక్షల ఓటర్ల తొలగింపు.. సీఈసీ ఎందుకిలా చేసిందంటే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

