ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 25: కొవిడ్ ఉధృతిని ఎదుర్కొంటామని, ప్రభుత్వం కూడా అన్ని చర్యలతో సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని 56వ డివిజన్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంగళవారం మంత్రి అజయ్‌కుమార్ పర్యటించి అక్కడ చేపట్టిన ఫీవర్ సర్వేను పరిశీలించారు. అనంతరం స్వయంగా స్థానికులకు జ్వర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసుకొని ఖమ్మం జిల్లా ముందు వరుసలో నిలిచిందన్నారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసొలేషన్ కిట్లకు కొరత లేదని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు పైడిపల్లి రోహిణి, సత్యనారాయణ, తోట గోవిందమ్మ, బుడిగెం శ్రీనివాసరావు, బుర్రి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, తోట రామారావు, గజ్జల వెంకన్న, మాటేటి కిరణ్‌కుమార్, తన్నీరు శోభారాణి, రవికాంత్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి , పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, మిషన్ భగీరథ ఈఈ పుష్ప తదితరులు పాల్గొన్నారు.
‘పువ్వాడ అజయ్ నగర్’ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
ఖమ్మం 8వ డివిజన్ పరిధిలో ఎన్నెస్పీ కాలువ కట్టకు ఇరువైపులా ఉండి కాలనీకి తన పేరు పెట్టిన పువ్వాడ అజయ్నగర్ను రానున్న రోజుల్లో ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నగర ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాంకుడోతు సురేశ్ తన సొంత ఖర్చులతో పువ్వాడ అజయ్‌నగర్ ఆర్చీ నిర్మాణం చేపట్టారు. ఆర్చీ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటైన పువ్వాడ అజయ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఎస్ఆర్ గార్డెన్ నుంచి వైఎస్ఆర్ నగర్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టి కాలనీలో వెలుగులు విరజిమ్మేలా చేస్తానన్నారు. కాలనీలో అభివృద్ధి పనుల విషయంలో చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు చవాకులు పేలినా కార్యకర్తలు పట్టించుకోవద్దన్నారు. టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, కార్పొరేటర్ కూరాకుల వలరాజు, సుడా డైరెక్టర్ దేవభక్తుని కిశోర్‌బాబు, ఏఎంసీ డైరెక్టర్ అజ్మీరా వెంకన్న, భుక్యా బాషా, వాంకుడోతు సురేశ్, శ్రావణ్, బాలాజీ, నాగేశ్వరరావు, సత్యం, వీరేందర్, హరి తదితరులు పాల్గొన్నారు.