ఖమ్మం, అక్టోబర్ 17: ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజవకర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఖమ్మం ప్రజల కళ్ల ముందు ఉంచానని అన్నారు. మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మాట ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఖమ్మానికి మంత్రి పదవిని ఏ పార్టీ ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తన ద్వారా ఆ అవకాశం కల్పించారని వివరించారు. దీనిని సద్వినియోగం చేసుకొని ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు.
ఖమ్మం 46వ డివిజన్ జహీర్పురలోని వేములపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధి చెందింది కాబట్టే అనేక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఇక్కడికి వచ్చి అనేక మాల్స్ ఏర్పాటు చేశాయని వివరించారు. వేములపల్లి బాబు తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుకు, వేములపల్లి వెంకన్న తనకు అత్యంత సన్నిహితులని అన్నారు. గడచిన పదేళ్లుగా ఖమ్మం ప్రజలతో మమేకమయ్యానని, వర్తక, వాణిజ్య సంఘాల వారి పట్ల నిబద్ధతతో పనిచేశానని గుర్తుచేశారు. మార్కెట్‌ను ఇకడి నుంచి తరలిస్తున్నామంటూ తొలినాళ్లలో కొందరు తనపై అనేక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కానీ తాను ఉన్నంత వరకు మారెట్ ఇకడి నుంచి తరలించడం జరగదని స్పష్టం చేశారు.
సమస్య సీఎం దృష్టికెళ్తే
ఎన్నికల ప్రచారంలో అజయ్ అన్నపానీయాలన్నీ బయటే జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇంతే నిబద్ధతో పనిచేసి ఖమ్మాన్ని ఆయన అభివృద్ధి చేశారని అన్నారు. వ్యాపారమైనా, క్రమశిక్షణైనా, దైవభక్తైనా, మరేదైనా వైశ్యుల వద్దే నేర్చుకోవాలని అన్నారు. కేసీఆర్‌కు, అజయ్‌కు హ్యాట్రిక్ అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. ఏ సమస్య అయినా సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లనంత వరకే అది సమస్యగా ఉంటుందని, ఒక్కసారి సమస్య సీఎం కేసీఆర్ దృష్టికెళ్తే అది పరిష్కారమైనట్లేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు ఆర్జేసీ కృష్ణ, చెరుకూరి కృష్ణమూర్తి, కన్నం వైష్ణవీ ప్రసన్నకృష్ణ, పసుమర్తి రామ్మోహన్, చిన్ని కృష్ణారావు, గుర్రం ఉమా మహేశ్వరరావు, బొమ్మ రాజేశ్వరరావు, రాయపూడి వెంకటరామారావు, పెనుగొండ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించాలని మంత్రి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. కేసీఆర్ సహకారంతోనే ఖమ్మాన్ని తీర్చిదిద్దానని అన్నారు. దానిని గమనించి ఖమ్మం ప్రజలు ఈ ఎన్నికల్లో తనకు మరోసారి అధిక మెజార్టీ అందించాలని కోరారు. ఖమ్మం 54వ డివిజన్ తిరుపతి స్టీల్ అధినేత రావులపాటి నరేశ్ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు బచ్చు విజయ్‌కుమార్, చేకూరి సత్యంబాబు, ఎలినేని రమణ, రాపర్తి శరత్, ఎన్.సురేందర్‌రెడ్డి, పోట్ల శ్రీకాంత్, బత్తుల మురళి, పిల్లి శేఖర్, కిలారు బాబ్జీ, సంపత్, ప్రభు, నరేందర్ పాల్గొన్నారు.
ఖమ్మం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలే తన బలం, బలగమని మంత్రి అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం 24వ డివిజన్లో మంగళవారం జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరెన్ని నీచ రాజకీయాలు చేసినా చివరికి గెలిచేది బాహుబలి లాంటి తానేనని స్పష్టం చేశారు. ఖమ్మాన్ని ఎవరు ఎంతలా అభివృద్ధి చేశారో ఇక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు షేక్ అబ్దుల్ రెహమాన్, గోలి రామారావు, పిల్లి విజయ్‌పాల్, పగడాల నాగరాజు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, పారా ఉదయ్‌కుమార్, అమరాగాని వెంకటేశ్వర్లు, కర్నాటి కృష్ణ, మక్బూల్, పల్లా రోజ్లీనా, మందడపు మనోహర్, షకీనా, సూరపనేని శేషగిరిబాబు, పేశెట్టి మనోహర్, తాజుద్దీన్, అనిల్, అస్లాం, కడారి వెంకన్న, చందు, శ్రీగాద శీను, రేగళ్ల నాగరాజు, రామలక్ష్మి, నాగలక్ష్మి, కవిత, అమీర్ పాషా పాల్గొన్నారు.