తొలకరికే విత్తనాలు వేయొద్దు
తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని, ఈ తరుణంలో స్వల్పకాలిక పంటలే వేయాలని సూచించారు.
- నేలపట్లలో రైతుల సమావేశంలో డీఏవో పుల్లయ్య
కూసుమంచి, జూన్ 11 : తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని, ఈ తరుణంలో స్వల్పకాలిక పంటలే వేయాలని సూచించారు.
రైతులు లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలని, పండ్లు, కూరగాయలు, పామాయిల్ సాగుతోపాటు అంతర పంటలుగా పెసర, మినుము సాగు చేయవచ్చన్నారు. వర్షాలు కాస్త ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నందున నేరుగా వెదజల్లే పద్ధతిలో పంటలు వేసి లాభాలు గడించాలన్నారు. పంట అవశేషాలను తగులబెట్టవద్దని, వాటిని భూమిలోనే కలియదున్నాలని సూచించారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కూసుమంచిలో ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. విత్తన, ఎరువుల స్టాక్ బోర్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ సతీశ్, ఏవో రామడుగు వాణి, ఏఈ ప్రియాంక, నేలపట్ల సర్పంచ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

