ఖమ్మం రూరల్, నవంబర్ 26 : సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గుర్రాలపాడులోని జీఆర్ఆర్, తల్లంపాడులోని శ్రీబాలాజీ, పొన్నెకల్‌లోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులను అదనపు కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. తేమ పరీక్షలను తనిఖీ చేయడంతోపాటు కొనుగోళ్లకు ఎంత సమయం తీసుకుంటుందని రైతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3,648 మంది రైతుల నుంచి 8,487 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద వేచి చూడకుండా ఉదయం తెచ్చిన పత్తిని అదేరోజు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పత్తిలో తేమ 8 శాతం ఉంటే క్వింటాల్ రూ.7,521 మద్దతు ధర వస్తుందని, ఒక్కో శాతం పెరిగితే రూ.75 చొప్పున క్వింటాల్‌కు తగ్గుతుందన్నారు. రైతులు నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, సీసీఐ ప్రతినిధి అవినాశ్, మార్కెట్ కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, వీరాంజనేయులు, ఏఈవోలు అదర్శ్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.