ఇల్లెందు, డిసెంబర్ 26: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడుదామని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని 3వ వార్డు కౌన్సిలర్ ఇంట్లో మంగళవారం పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్ల ఆమె సమావేశమయ్యారు. అప్పుల పేరుతో ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను మాత్రమే చూపిస్తున్నదని, కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన అస్తులను వెల్లడించడం లేదని విమర్శించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా, కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు, వాంకుడోత్ తారా, లలిత శారద, చీమల సుజాత, కొడకంచి పద్మ, నాయకులు శీలం రమేష్, దాస్యం ప్రమోద్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.