ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 2 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలం, భవననిర్మాణ మ్యాపులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లోని తన చాంబర్లో పరిశీలించారు. ఆధునాతన సౌకర్యాలతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు అతిత్వరలోనే చేపట్టి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.