ఆదివారం 24 జనవరి 2021
Khammam - Dec 03, 2020 , 02:27:32

ప్రారంభానికి సిద్ధం చేయాలి

ప్రారంభానికి సిద్ధం చేయాలి

  • అభివృద్ధి ముగింపు పనులను త్వరగా పూర్తి చేయాలి
  • ఎక్కడా లోటుపాట్లు ఉండొద్దు
  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముగించి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి నగరంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, ముస్తాఫానగర్‌ జంక్షన్‌, గోళ్లపాడు ఛానల్‌, వాక్‌వే పార్కు, ఎన్నెస్పీ కెనాల్‌ వాక్‌వే, ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్‌, బల్లెపల్లి వైకుంఠధామం, రఘునాథపాలెం మినీ ట్యాంక్‌ బండ్‌ జంక్షన్‌, ఇందిరానగర్‌ పార్క్‌ ప్రారంభోత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.బల్లెపల్లి వైకుంఠధామంలో అంతర్గత లైట్లు, టైల్స్‌ ఏర్పాటు, స్టోర్‌ రూమ్‌ ప్లోరింగ్‌ పనులను యుద్ధప్రాతినదికన రేపటిలోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా రఘునాథపాలెం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన రైతు కూలీల విగ్రహా జంక్షన్‌లో గ్రీనరీ, లైటింగ్‌, మిగులు పనులు, రఘునాథపాలెం పార్క్‌ ప్రారంభోత్సవ శిలాఫలకం, రోడ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. రఘునాథపాలెం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పనులతో పాటు డ్రైనేజీ పనులను కూడా చేపట్టాలన్నారు. రోడ్ల ఏర్పాటు పట్ల గ్రామస్తులకు డ్రైనేజీ సమస్యలేకుండా పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కెనాల్‌ వాక్‌వే ప్రవేశ మార్గాలు, ఓపెన్‌జిమ్‌, పిల్లల ఆటవిడుపు పరికరాలు, గ్రీనరీ లైటింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.అనంతరం ఇందిరానగర్‌ పార్క్‌ను మంత్రి పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు.

మోడ్రన్‌ టాయిలెట్లను, సీసీ రోడ్లను పరిశీలించారు. నూతన ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ పనులను, వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు, పరిశీలించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. జనవరిలో బస్టాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. గోళ్లపాడు ఛానల్‌ అంతర్గత పైప్‌లైన్లు పూర్తి చేసినందున పార్క్‌, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్‌ డాక్టర్‌ జీ.పాపాలాల్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, నీటిపారుదల శాఖ ఈఈ నర్సింహారావు, డీఈ అర్జున్‌, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు రంగారావు, ధరణీ, కృష్ణాలాల్‌, కార్పొరేటర్లు  పాల్గొన్నారు.


logo