Korutla | కోరుట్ల రూరల్ : మద్యం మత్తులో యువత మద్యానికి బానిసై రోడ్లపై పడిపోవడం సాధారణంగా మారింది. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లోని ఓ సినిమా థియేటర్ ముందు మద్యం తాగిన మైకంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మద్యం మత్తులో పడిపోయి ఉన్నారు. రహదారి వెంట వెళ్లే మహిళలు వీరిని చూసి భయపడుతున్నారు. ఇలా తాగి రోడ్లపై పడిపోయే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.