Youth Development Applications | వెల్గటూర్, మే 28 : వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్యక్రమాన్ని ఎంపీడీవో సిబ్బంది కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగులు జూన్ 2న అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు.