Yoga Day | గంగాధర, జూన్ 21: సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అవసరమని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. మండలంలోని ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి యోగ చేయడం నేర్చుకోవాలన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రంగారావుపల్లిలో
గంగాధర మండలం రంగారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ను అభ్యసించాలని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మానసిక, శారీరక ఆరోగ్యం, పరిపూర్ణ వికాసం పొందడానికి యోగాను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక , పాఠశాల ఉపాధ్యాయురాలు రాధిక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.