Yarn subsidy | సిరిసిల్ల రూరల్, జూన్ 6: సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్ టైల్ పార్కులో శుక్రవారం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ, ఉపాధి, ఇతర సమస్యలపై చర్చించారు.
సమావేశం అనంతరం సిరిసిల్లకు విచ్చేసిన చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ N .V . రావు ను కలిసి, టెక్స్టైల్ పార్కు కార్మికుల సమస్యలపై పార్క్ లోని పరిపాలన భవనం లో కలిసి సమస్యల్ని వివరించారు.తరువాత వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొడం రమణ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ తొందరగా అందించాలని కోరారు. అదేవిధంగా కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటుచేసిన టెక్స్టైల్ పార్కులో కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జయింట్ డైరెక్టర్ కు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ , మామిడాల శ్రీనివాస్ , రాచర్ల వేణు , పులి రమేష్ , కందికట్ల శ్రీనివాస్ , వెంకటేష్ టెక్స్టైల్ పార్క్ కార్మికులు పాల్గొన్నారు.