Yadava Sangh | జగిత్యాల, సెప్టెంబర్ 25 : జగిత్యాల జిల్లా యాదవ యువజన సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలో యాదవ యువజన సంఘం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిల్లా యాదవ యువజన సంఘం భవన నిర్మాణానికి అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి స్థలం కేటాయించడానికి చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యాదవులకు హామీ ఇచ్చారు.