యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారంభించింది. అంతకుముందు శాంతి పాఠం, అవధారణం, ద్వార తోరణ ధ్వజకుంభారాధన కొనసాగింది. మరోవైపు 108 మంది రుత్వికులు ప్రధానాలయం గర్భాలయం ముఖమండపంలో లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు నిర్వహించారు. సాయంత్రం బింబ పరీక్ష, మానోన్మాన శాంతి హోమం జరిపారు. బాలాలయంలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, నవకలశ స్నపనం, లఘుపూర్ణాహుతిని చేపట్టారు.
– యాదాద్రి, మార్చి 22
బాలాలయంలో నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో శాంతి పాఠం, ద్వార తోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, షోడష కలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతిని జరుపుతారు. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం, యాగశాలలో ద్వార తోరణధ్వజ కుంభారాధనలు, మూల మంత్ర హవనం, పంచగ
వ్యాధివాసం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు. ప్రధానాలయంలో లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు చేపడుతారు.