Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కేటాయిస్తున్నారంటూ మహిళలు నిరసన బాట పట్టారు.
ఇవాళ ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరు అయ్యాయని మహిళలు రోడ్డెక్కారు. అనర్హులకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ మహిళలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆందోళనలు తీవ్రతరం చేసిన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకొని కిందికి దించారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్లకే ఇల్లు మంజూరు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇచ్చింది ఏమీ లేదని చేశారు. గ్రామంలో కాంగ్రెస్ వాళ్లు నాలుగు బ్యాచులుగా విడిపోయి వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇల్లు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమలాంటి పేదోళ్లు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డదని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా విరమింపజేశారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి