Minister Ponnam Prabhakar | మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Minister Ponnam Prabhakar | చిగురుమామిడి, జూన్ 29 : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో రూ.10 లక్షల ఈజీఎస్ నిధులతో మహిళా సమాఖ్య భవనాన్ని (వీవో) ప్రారంభించారు. చిగురుమామిడిలో రూ.16 లక్షలతో డీఎంఎప్టీ నిధుల ద్వారా వీవో భవన నిర్మాణాన్ని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తో కలిసి సోమ వారం శంకుస్థాపన చేశారు. మహిళలు సాధికారత సాధించుకునేందుకు, మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు మహిళా సంఘం భవనాలను గ్రామాల వారిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘ సభ్యులకు అనేక రుణాలను అందించడం జరుగుతుందని, ఉపాధి అవకాశాలను పెంపొందించుకునేందుకు అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. మహిళలు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం మంత్రి మహిళలకు సూచించారు. అనంతరం బొమ్మనపల్లి లో బూతు లెవల్ అధికారులు, బీఎల్వోలు చేపడుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో పెద్దమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి వెంట కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో షర్మిల, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో మచ్చ గీత, పంచాయతీరాజ్ డీఈ మంజుల భార్గవి, తహసీల్దార్ కొండం కనకయ్య, ఎంపీడీవో రామ్మోహన్ చారి, పంచాయతీరాజ్ ఏఈ నిరంజన్ రెడ్డి, ఏపీఎం రజిత, ఏపీవో రాజు, సర్పంచులు ఆకవరం భవాని, గడ్డం రమాదేవి, మార్క రాజకుమార్, అల్లేపు సంపత్, అలువాల శంకర్, చింతపూల నరేందర్, కాటం సంపత్ రెడ్డి, గూళ్ల రజిత, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అందే సురేష్, నాయకులు చిట్టిమల్ల రవీందర్ నాయకులు పాల్గొన్నారు.
ఓబులాపూర్‌లో పలువురి ముందస్తు అరెస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ ఓగు లాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో సోమవారం పాల్గొనగా ముందస్తుగా ఓగు లాపూర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని శ్రీనివాస్, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఎస్సై జగదీశ్వర్ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎన్నికల హామీలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ 100 రోజుల్లో ఓగులాపూర్ భూములను ప్రభుత్వం నుండి తిరిగి ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక రోజు ముందు సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నించారు. కాగా పోలీసులు మంత్రి పర్యటనకు ముందు అదుపులోకి తీసుకొని సమావేశం అనంతరం విడిచిపెట్టారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

