కోనరావుపేట, మే 27 : తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని 8వ వార్డులో మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో అందోళనకు దిగారు. వారం రోజుల నుంచి నల్లా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తే ఒక్క రోజు మాత్రమే వాటర్ ట్యాంకర్ ద్వారా నీరందించినట్లు తెలిపారు. ఈ విషయమై కార్యదర్శిని సంప్రదించగా, సాయంత్రం వేళలో వాటర్ ట్యాంకర్‌తో తాగునీటిని అందించినట్లు పేర్కొన్నారు.