Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్. మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీచందన తో పాటు సిబ్బంది రజిత, నరసమ్మ తదితరులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్ర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎనగంటి రవి, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, నాయకులు జనగామ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.