కొత్తపల్లి, జూలై 10 : ‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాంగ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప్పా ఎనాడూ అడ్డుకోలేదు. జర్నలిస్టులపై ఎందుకీ కక్ష సాధింపు చర్యలు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్, జేసీ, ఆర్డీవో కరీంనగర్‌లోని 130 మంది జర్నలిస్టులకు వారి భార్యల పేరిట రెండు పడకల గదులు కేటాయించామని, కానీ పట్టాలు ఉన్న వారు ఇండ్లు నిర్మించుకునేందుకు యత్నిస్తే రెండేళ్లుగా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. వారికి ఆ మహిళల ఉసురు తగలదా..? అవేమైనా దొంగ పట్టాలా.. లేక కబ్జా చేసారా..? అని ప్రశ్నించారు. హుస్నాబాద్‌లో లేని నిబంధనలు కరీంనగర్‌లోనే ఎందుకు? అంటూ నిలదీశారు. గతంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం పేరిట ఇచ్చిన పట్టాలపై నెలకొన్న సమస్యను పరిషరించాలని కోరు తూ గురువారం పలువురు జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పం దించారు.
చింతకుంట, మలాపూర్లోని స్థలాలను మాజీ ఎమ్మెల్యేలు వీ సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గిట్టడం లేదు కనక.. పట్టాలపై ఉద్యమానికి సిద్ధం కావాలని, బీఆర్ఎస్ మీకు అండగా ఉండి ఇం డ్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. ఎవరూ కూడా భయపడాల్సినవసరం లేదని, కేసు లు పెట్టినా, పోలీసు బలగాలతో వచ్చినా తగ్గేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టులకు అవసరమైతే కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు మొత్తం బీఆర్ఎస్ అండగా ఉం టుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలున్న మహిళలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గంగుల డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీనికి స్పందించాలని డిమాండ్ చేశారు.