హుజూరాబాద్‌టౌన్/ వీణవంక ఏప్రిల్ 22: బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్‌గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్ను ఓడించారని దుయ్యబట్టారు. వాళ్లిద్దరూ తోడు దొంగలని, గత ఉప ఎన్నికల వేళ రేవంత్‌కు ఈటల 25 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. ఈ విషయం రెండేండ్ల క్రితమే బయటపెట్టానని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు వీరిమధ్య పంపకాల్లో వచ్చిన తేడాతో పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. శనివారం ఆయన వీణవంక మండలం వల్భాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆరోపించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, కాంగ్రెస్ సాంల పార్టీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ప్రజా సంక్షేమ పార్టీ అని చెప్పారు. ఈటల సహనం కోల్పోయి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, సీఎం కేసీఆర్‌నే ఎవడ్రా..? అని ఉచ్చరిస్తున్నాడని మండిపడ్డారు. తనకు తల్లిదండ్రులు, సీఎం కేసీఆర్ సంస్కారం నేర్పారని, అందుకే నోరు జారకుండా మాట్లాడుతున్నామని అన్నారు. ఉప ఎన్నికల వేళ ఈటల రేవంత్‌రెడ్డికి 25కోట్ల ఇచ్చినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నదని, ఈ విషయంపై ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజులల్లో రాజేందర్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి, మాజీ జడ్పీటీసీ, కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, వల్భాపూర్‌లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షు డు రఘుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.