Farmers | చిగురుమామిడి, మే 5 : గాలి బీభత్సానికి అకాల వర్షం కు మండలంలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డివిజనల్ హార్టికల్చర్ అధికారిని మంజువాణి అన్నారు. మండలంలోని ముదిమాణిక్యం,ఇందుర్తి, గునుకులపల్లి, లంబాడి పల్లి గ్రామాల్లో రాలిన మామిడి తోటలను పరిశీలించారు. ముదిమాణిక్యంలో జక్కుల రవికి చెందిన ఐదు ఎకరాల మామిడి తోట గాలి బీభత్సానికి రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని. నష్టపోయిన మామిడి తోటల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రైతులు మనోధైర్యం కోల్పో వద్దని భరోసా ఇచ్చారు.
ఇందుర్తిలో కూలిన ఇళ్లను పరిశీలించిన ఎంపీఓ
గాలి బీభత్సానికి దెబ్బతిన్న ఇళ్లను ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని ఇందుర్తి గ్రామంలో అందే రాములు, మంద రాజమల్లు ఇల్లు వర్షానికి కూలిపోగా, ఇంటి పైకపు రేకులు లేచిపోయాయి, వాటిని సోమవారం పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని వారికి హామీ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నష్టపోయిన వారి జాబితాను పంచాయతీ కార్యదర్శి లు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వంకు తెలియజేస్తారన్నారు. మీరు వెంట పంచాయతీ కార్యదర్శి సుమంత్, తదితరులు ఉన్నారు.