Welfare schemes | మల్లాపూర్, జూన్ 14: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర సహకార శాఖ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కెఎంఆర్ గార్డెన్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన 720 మంది లబ్ధిదారులకు శనివారం మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సర్కార్ పనిచేస్తుందని, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామాని తెలిపారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత, మాజీ జడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, నాయకులు పూండ్ర శ్రీనివాస రెడ్డి, నల్ల బాపురెడ్డి, సిరిపురం రవీందర్, నల్ల రాజన్న, కొటగిరి ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.