MLA Sanjay Kumar | జగిత్యాల : జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు వార్డు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య స్వగృహంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ అధికారులు,ప్రజలు ఇంటి నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించే ముందు ముందు తరాల కోసం ఆలోచన చేయాలని,సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని కోరారు. ఒక్కో చెరువు కు రూ.3.5 కోట్ల తో మోతే,చింత కుంట చెరువు పురుద్ధరణకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 9 గ్రామాలు ఏకగ్రీవం కావడం ఆనందదాయకమని, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అందరూ ఎన్నిక అయ్యారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, స్థానిక మాజీ కౌన్సిలర్ అల్లే గంగసాగర్, క్యాదసు నవీన్, డీఈ ఆనంద్, ఏఈ అనిల్, నాయకులు క్యాదసు నాగయ్య, బాలే శంకర్, చెట్పల్లి సుధాకర్, దుమాల రాజ్ కుమార్, డీపీబీవో శ్రీఖర్, తాజా మాజీ కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.