Koppula Eshwar | జగిత్యాల, నవంబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. ముఖ్యమైన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించాలంటే నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీలోని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతీ నాయకుడిపైనా ఉందని, ప్రతీ గ్రామంలో నాయకులు తదుపరి కార్యాచరణపై సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీల ఓటర్ల తుది జాబితా విడుదల సమయంలో పొరపాటుగా తొలగించిన ఓట్లను గుర్తించి అధికారులకు తెలిపేలా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు.
ప్రజల్లో బీఆర్ఎస్పై నమ్మకం ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్పై ప్రగాఢమైన నమ్మకం ఉందని, నాయకులు ఇప్పుడు నుండే ప్రజల్లోకి వెళ్లి మమేకత పెంచుకోవాలని తెలిపారు. అందుకు పార్టీ నాయకులంతా ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా నడవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు గడపగడపకు వివరించాలని ఆయన సూచించారు. విభిన్న అంశాలపై దృష్టి కేంద్రం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలను అమలు చేయడంలో విఫలమైన విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచనలిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలు వంటి అంశాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.