Strengthen the CPI | చిగురుమామిడి, ఏప్రిల్ 30: భారతదేశంలో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకులు బండారు తిరుపతి అధ్యక్షతన సీపీఐ గ్రామ శాఖ మహాసభ బుధవారం నిర్వహించారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ నిరంతరం కార్మిక, కర్షక , పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సుకోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి, దోపిడీ లేని వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లుగా పనిచేస్తుందని అన్నారు. దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజల కోసం పనిచేసే పార్టీగా సీపీఐ కీర్తించబడుతుందని, దేశం కోసం,దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, మానవ హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ సీపీఐ అని కొనియాడారు.
దేశంలో పాలకులు ఎందరు మారినా ఒక్క ప్రజల పక్షాన నిలిచే పార్టీగా సీపీఐ కి పేరుందని, అలాంటి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం శ్రేణులంతా పట్టుదలతో కృషి చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, శాఖ కార్యదర్శి అందే సంపత్, నాయకులు బండారి తిరుపతి, వెంకటయ్య, రాములు, నరేష్, చొక్కయ్య తదితరులు పాల్గొన్నారు.