AITUC | కోరుట్ల, సెప్టెంబర్ 15: అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో కాసిం రజ్వీ, రజాకారులు, జమీందారులు భూస్వాములు జరిపిన దమనకాండలో 4500 మంది కమ్యూనిస్టులు మరణించారని పేర్కొన్నారు.
సిపిఐ పోరాటాలతో రజాకారుల పాలన నుంచి 3,000 గ్రామాలకు విముక్తి కలిగిందని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, ముక్దుం మొయినుద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి, సుమలత, పద్మ, గంగమణి, హిమగిరి, లక్ష్మి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండీ సమీర్, పుల్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.