purchasing centers | వీణవంక, అక్టోబర్ 24: రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తహసీల్దార్ అనుపమరావు, ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఎం సుధాకర్ ప్రారంభించారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసి సునీల్, కామిడి శ్రీపతిరెడ్డి, రశీద్, ఆర్ఐ లు రవి, నర్సయ్య, బ్రాహ్మణపల్లి ఎంఎస్సీసీ పద్మ, సీసీలు ఆనంద్, ఎస్ తిరుపతి, వీ తిరుపతి, ఘనశ్యాం, ఆయా గ్రామాల అధ్యక్షురాళ్లు, వీవోఏలు, హమాలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.