Karimnagar | తెలంగాణచౌక్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో సంఖ్యా బలం ఉందనే మంద బలంతో కార్మికుల, కర్షకుల హక్కుల కాలరస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను సవరిస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న 29 కార్మికుల చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. మతతత్వ విద్య ను దేశ ప్రజల మీద రుద్ద దానికి జాతీయ విద్య విధానం, ప్రవైట్ వ్యాపారులకు అప్పగించడానికి విద్యుత్ సంస్కరణలు చేపట్టారని విమర్శించారు.
వెంటనే ఈ చట్టాలను సవరించలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండి పడ్డారు. ఉపాధి హామీ పథకానీ బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యుద్ధ నివారణకు ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యుద్ధ వల్ల దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉందన్నారు. వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల మీద పెను భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై నిరంతరం పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గుడికందుల సత్యం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్, నాయకులు శ్రీనివాస్, అరవింద్, నరేష్ పాల్గొన్నారు.